వ్యవసాయ పై ఒక రోజు పర్యటన నిమిత్తం గుంటూరు జిల్లా లో కొల్లిపర, తెనాలి మండలంలో తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ముందుగా వల్లబాపురం గ్రామంలో ఉద్యానవన పంటలను, పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించారు. ఏమి పంటలు వేస్తారు, పంటలు పండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దిగుబడి ఎంత వస్తుంది, తదితర అంశాలపై రైతులను,అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పరంగా రైతులకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మంత్రి కి అధికారులు వివరాలు తెలిపారు. మంత్రి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి ఉద్యానవన పంటలు,సేంద్రీయ వ్యవసాయ గురించి సమావేశంలో పంటల గురించి వివరాలు అడుగి తెలుసుకున్నారు.
అనంతరం తెనాలి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ని ఎమ్మెల్యే శివకుమార్ తో కలిసి సందర్శించారు మంత్రి. ల్యాబ్ ని పరిశీలించి మంత్రి ల్యాబ్ టెస్టులు, రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయనికి ప్రభుత్వం తరపున రైతులకు అందిస్తున్న సేవల వివరాలు మంత్రికి ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయ పై గతంలో ఆంద్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో సందర్శించడం జరిగిందని అన్నారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, సేంద్రియ ఎరువుల ద్వారా మంచి దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు, రైతులు ఆశించిన ధర వస్తాయని అన్నారు.
ప్రతి రైతు సేంద్రీయ వ్యవసాయపై దృష్టి పెట్టాలని కోరారు. వ్యవసాయంపై రైతుల అభిప్రాయాలను తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. వ్యవసాయంపై ఎక్కడఎక్కడ వివిధ రకాల పంటలు పరిశీలన ద్వారా తెలంగాణలో అవి యంతమేర ఉపయోగపడతాయో పరిశీలిస్తామన్నారు. సేంద్రియ సంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చెయ్యటం ద్వారా అధిక దిగుబడి ధరలు వస్తాయని తెలిపారు. రైతాంగం పంటల పండించే విషయంలో డిమాండ్ ఉత్పత్తులు పండిస్తే లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు. విదేశాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో పంటలు పండిస్తారు వాళ్లకు వాతావరణం అనుకూలంగా ఉండదని అన్నారు. విదేశాల్లో వారి అవసరాల మేర కూడా పంటలు పండవని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయంలో రాబోయే రోజుల్లో ఆహార ఉత్పత్తులు పండించటంలో భారత దేశంకి గొప్ప భవిష్యత్ ఉందని అన్నారు.
భారతదేశంలో 5,6 రాష్ట్రాల్లోనే అన్నిరకాల పంటలు పండే పరిస్థితి ఉందని, రైతులు ఏమీపంటలు పండించాలి, మార్కెటింగ్ వ్యవస్థ ని తదితర అంశాలపై కేంద్రం ప్రభుత్వం చూడాలి ఈ అంశాల పై దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వ్యవసాయం మీద సమగ్రమైన విధానం కలిగి ఉండాలి రైతాంగానికి అది అవసరం ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులు అందించే శక్తిసామర్ధ్యాలు భారతదేశానికి మాత్రమే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో వరి పండితే చాలు అన్న పరిస్థితి నుంచి వరి వద్దు అన్న పరిస్థితిలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. అంతిమంగా రైతుల ఆదాయం పెరిగి సంతోషంగా ఉండాలనేది తమ ఉద్దేశమన్నారు. తెలంగాణలో కూడా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ టెస్టులు ఏర్పాటుకు పరిశీలన చేస్తామని తెలిపారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో రైతులకు ఏమి ఉపయోగకరమైనవి చేస్తున్నారో వివరాలను అధికారులని అడిగి తెలుసుకోవటం జరిగిందని మంత్రి తెలిపారు.
International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!