NTV Telugu Site icon

Fertilizers: యూరియా, డీఏపీ, ఎరువులు సిద్ధం చేయండి.. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలు

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

రాష్ట్రానికి అవసరమైన యూరియా, డీఏపీ, ఎరువులు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారులు రాములు, ప్రధాన ఎరువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించినట్టు తెలిపారు..ఇప్పటికే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆమోదం తెలిపిందన్న ఆయన.. 10.5 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్‌ ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ మరియు ఎస్ఎస్‌పీ సమకూర్చాలన్నారు. ఇక, మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచాలని.. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.

Read Also: TRS Vs BJP: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత..