Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పీసీసీఎఫ్ డాక్టర్ జి సువర్ణ, ములుగు, మహబూబాబాద్ డీఎఫ్ఓలు, ఐటీడీఏ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అటవీ చట్టాలు, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడులు, బడులు, ఆస్పత్రులు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ROFR చట్టం అడ్డు కాదని గుర్తు చేశారు. ఇక, అందుకే అటవీ, అభయారణ్య చట్టాలను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేసింది.
Read Also: India Pakistan: భారత్ క్షిపణులతో దాడి చేసింది.. రాత్రి 2.30కి పాక్ ప్రధానికి ఆసిమ్ మునీర్ ఫోన్..
అయితే, ఏజెన్సీ ఏరియాల్లో దేవాదుల వంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న ప్రజల అవసరం మేరకు రోడ్లు నిర్మించడంలో అభ్యంతరాలు ఎందుకని అటవీ శాఖ అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించింది. దుబ్బగూడం, కొండపర్తి లాంటి గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అందుకే నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టులు ముందుకు రావడం లేదనీ గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఐటిడిఏ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కనీస రహదారి సదుపాయాలు కల్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
ఇక, మంత్రి సీతక్క ఆదేశాలతో కనీస రహదారుల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని అటవీ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. అటవీ, అభయారణ్య చట్టాలు నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, కల్వర్టులు, లోకాజ్ వేల నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని పీసీసీఎఫ్, అటవీ శాఖ అధికారులు, డీఎఫ్ఓలు హామీ ఇచ్చారు. తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అటవీ, అభయారణ్య చట్టాలు అంగీకరించని పక్షంలో దృఢంగా పటిష్టంగా ఉండేలా గ్రావెల్, మట్టి రోడ్ల నిర్మాణాలను చేపడతామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ములుగు నియోజకవర్గ ఏజెన్సీలో పెండింగ్ పనుల జాబితాను అటవీ శాఖ అధికారులకు అందించి.. ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ విభాగంతో సమావేశం చేసుకొని పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
