ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే ఈటల రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల తాకట్టుపెట్టారని మండిపడ్డ ఆమె.. సీఎం కేసీఆర్ పై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఈటల రాజేందర్ రాజీనామ చేస్తూ.. పార్టీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. కానీ, ఈటల.. పార్టీకి చేసిన సేవకంటే సీఎం కేసీఆర్ ఎక్కువగా పదవులు, బాధ్యతలు ఇచ్చారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.. కానీ, ఆత్మ గౌరవంతో ఉండే వారికి అవమానం జరిగింది అంటున్నారని.. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించారన్నారు.. సీఎం కేసీఆర్ పై ఈటల మాటలు ఖండిస్తున్నాం.. ఐదేళ్లుగా అవమానం జరుగుతుంది అన్నారు. మరి 5 ఏళ్లుగా ఆత్మగౌరవం కోసం పాటుపడక ఈరోజు వరకు ఎందుకు ఉన్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరు స్థాయికి రావడానికి గొప్ప అవకాశం కల్పించింది సీఎం కేసిఆర్ కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ఆత్మ గౌరవం కోసం కాదు ఆత్మ రక్షణ కోసం పార్టీ వీడుతున్నారని మండిపడ్డారు.. తనకున్న అధికారం, గౌరవం ద్వారా ఆ ప్రాంతానికి మేలు చేయాలి. ఇది నాయకుని లక్ష్యం.. కానీ, మీరు పేదవాళ్లు భూములు తీసుకున్నారని ఆరోపించారు.
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
తాజావార్తలు
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
-
Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?