Site icon NTV Telugu

Celebrate Rakhi Festival: సోదరుని ఇంట రక్ష బంధన్ వేడుకల్లో మంత్రి సబితమ్మ…

Sabitha Indrareddy

Sabitha Indrareddy

శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. రక్ష బంధన్ వేడుకల్లో మంత్రి సబితమ్మ పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు నరసింహ్మ రెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టారు. సోదరుడు నరసింహ్మ రెడ్డికి స్వీటును తినిపించారు మంత్రి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అక్కా- తమ్ముళ్ల, అన్న- చెల్లెళ్ళ వెల కట్టలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఇంట సంతోషాలు వెల్లివిరిసే రక్ష బంధన్ ను కుటుంబసభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

read also: RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతం చేసే రక్షా బంధన్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రజలకు, మహిళ సోదరిమణులకు, ఆత్మీయ అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియ జేసారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైఖ్య రక్ష బంధన్ నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనలి, గ్రామాల్లో 75 మందికి స్వయం సహాయక మహిళలు రాఖీలు కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
CPI Narayana: బండి సంజయ్‌వి పనికిమాలిన మాటలు..!

Exit mobile version