Ponnam Prabhakar: బీజేపీ నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండే కానీ తాను వచ్చిన వర్గాలకు మద్దతుగా ఉండకపోయినా కించపరిచేలా మాట్లాడటం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ కుల గణన కి సానుకూలమా..? వ్యతిరేకమా..? అని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తెచ్చేది ఉందా..? లేకంటే బలహీన వర్గాల ద్రోహిగా ఉంటారా..? తేల్చుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత సేపు రాజకీయంగా మతాన్ని వాడుకోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎన్నికల కొరకు కుల గణన అంటున్నావు లక్ష్మణ్ .. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉండాలా వద్దా చెప్పు అని లక్ష్మణ్ పై మండిపడ్డారు. బలహీన వర్గాల వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పే బీజేపీ.. బీసీ లకు ఏం లాభం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. రిజర్వేషన్ పై బీజేపీ ది ద్వంద్వ వైఖరి అన్నారు. బీజేపీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Read also: CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
బీజేపీ కి ఉన్న బీసీ అధ్యక్షుడునీ తొలగించారని గుర్తుచేశారు. ఎల్పీ నేత ను కూడా బీసీ కి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన.. సకల జనుల సర్వే లాగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టామన్నారు. బీఆర్ఎస్ వైఖరి .. కుల గణన పై ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మూసి యాత్రలో కుల వృత్తి దారుల సమస్యలు విన్నామన్నారు. మూసి ప్రక్షాళన కి చేతనైతే సలహాలు..సూచనలు ఇవ్వాలని కోరారు. కేటీఆర్..హరీష్ అడిగినట్టు… హైదరాబాద్ లో మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా తిరుగుతామన్నారు. ట్టానికి లోబడి ఒప్పించి..మెప్పించి సేకరణ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేసింది బీజేపీ అని తెలిపారు. ముందు మీ పదేళ్ల హామీలు..అమలు పై చర్చ పెట్టండి అని సెటైర్ వేశారు.
Read also: Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు
బండి సంజయ్ వాళ్ళని.. వీళ్ళని అరెస్టు చేసి జైల్లో పెడతా అన్నారని గుర్తుచేశారు. కరీంనగర్ జైల్ లో రూం కట్టించిన అన్నాడు.. మొన్న పొయ్యి చూస్తే జైల్లో రూం లేదు ఏం లేదన్నారు. బండి సంజయ్ .. వ్యక్తిగతంగా నాకు సోదరుడు.. కానీ రాజకీయంగా మాపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతనైతే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు కేంద్రం నుండి అదనపు నిధులు తెప్పించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే ఆమోద ముద్ర వేయించాలని తెలిపారు. తెలంగాణ కి రావాల్సిన నిధులు మీరు తెండి ..లేదంటే మమ్మల్ని తీసుకెళ్ళండి అడుగుతామన్నారు. మీకు చేతనైతే.. బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని సిఎం తో సహా అందరం వస్తామన్నారు.
Green Tea: గ్రీన్ టీ మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ..