Site icon NTV Telugu

Minister Niranjan Reddy : కేంద్రంది.. కార్పొరేట్‌ శక్తులపరం చేసేందుకు కుట్ర

హైదారాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్‌ఎస్‌ 21వ ప్లీనరీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందించే తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీనికి మంత్రి గంగుల కమలాకర్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న కేంద్రం.. ఇప్పుడు రైతుల కష్టాలను రెట్టింపు చేసిందన్నారు. అంతేకాకుండా నల్లధనాన్ని తీసుకువస్తామని.. నల్లచట్టాలు తీసుకువచ్చరన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్‌ శక్తులపరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

వ్యవసాయిక దేశమైన భారతదేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంమాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కొమ్ముగాస్తూ వ్యవసాయాన్ని క్రమంగా కార్పొరేట్ శక్తుల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు.

Exit mobile version