Site icon NTV Telugu

Mallareddy-Etala: ఈటల- మల్లారెడ్డి ఆత్మీయ ఆలింగనం.. షాక్‌ లో పార్టీ శ్రేణులు

Mallareddy Etala

Mallareddy Etala

తెలంగాణ రాష్ట్రంలో బోనాలు సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న లాల్‌ దర్వాజ బోనాల సందర్భంగా బంగారు బోనాలతో.. పట్టు వస్త్రాలతో మంత్రులు, క్రీడాకారులు, నేతలు, హాజరై అమ్మవారికి సమర్పించారు. అయితే బోనాల సందర్భంగా.. ఓ అరుదైన సన్నివేశం చర్చకు దారితీస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆయన బీజేపీ పార్టీలో చేరి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతుంటారు. ఏనిమిషంలో అయినా సరే విమర్శనాస్త్రాలతో వార్ చేస్తూనే వుంటారు. అయితే.. నిన్ని లాల్‌ దర్వాజ బోనాల పండుగ నేపథ్యంలో ఈటల రాజేందర్ సికింద్రాబాద్ ఏడుగుళ్ల దేవాలయంలో జరిగిన బోనాల వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అప్పటికే అక్కడ పూజలు చేస్తున్నారు.

read also: Mahbubnagar TRS: అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులను లెక్కచేయడంలేదా..?

అక్కడకు వచ్చిన ఈటలను చూసిన మల్లారెడ్డి ఈటల వద్దకు వెల్లారు, ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు నవ్వుల వర్షం కురిపించారు. మల్లారెడ్డికి ఈటెల రెండు చేతులు జోడించి నమస్తే పట్టారు. దీంతో మాల్లారెడ్డి చాలులే అన్నట్లు చేతులు పట్టుకుని ఈటెలను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు ఆనందంతో చాలా రోజుల తరువాత కలుసుకున్నాం అన్నట్లు పలకరించుకున్నారు. అక్కడున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు ఏం జరుగుతుందో కాసేపు అర్ధం కాలేదు. షాక్‌ లో అలా ఈటెను, మంత్రి మల్లారెడ్డిని చూస్తూ వుండిపోయారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పార్టీలు వేరే.. ఒకరు నొకరు సవాల్‌ ప్రతిసవాల్‌ విసురుకునే వారు ఇప్పుడు ఇలా ఏంటని నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. అయితే.. ప్రస్తుతం వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటూ ముచ్చటిస్తున్నారు నెటిజన్స్.

Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?

Exit mobile version