Malla Reddy: మంత్రి స్థానంలో ఉండి గొర్రె కాపరిగా మారారు మల్లారెడ్డి. గొర్ల వేషధారణ ధరించి అందరితో ఆనందంగా గడిపారు. మంత్రి పదవిలో ఉండి మీతో పాటు మేము అంటూ మంత్రి చేసిన వేషధారణే ఇందుకు నిదర్శనం. వారి కష్టాలు తెలుసుకున్నారు. కాసేపు గొర్రెల కాపరిగా మారారు. దీంతో మంత్రి మల్లారెడ్డిని ఇలా చూసిన వారంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మంత్రి పదవిలో ఉండికూడా సామాన్య ప్రజలతో సరదాగా గడపడం అంటే అది మంత్రి మల్లారెడ్డికే సాధ్యమని ప్రశంశిస్తున్నారు.
Read also: Pakistan Rains: పాక్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ వర్షం.. 30ఏళ్ల రికార్డు బద్దలు
అసలు మల్లారెడ్డి గొర్రెకాపరిగా ఎందుకు మారారనేది ప్రశ్న అయితే.. మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గౌడవెల్లి గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు 15 యూనిట్ల గొర్రెపిల్లలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేసారు. గొర్రె పంపిణీ అనంతరం గొర్ల కాపరి వేషధారణలో గొర్ల మంద వద్దకు వెళ్ళి యాదవులను ఆకట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. వారితో మట్లాడారు. ఎటువంటి సమస్య వచ్చిన మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ న్యాయ కత్వంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలైందని అన్నారు. ఇదంతా సీఎం ఆలోచనే అన్నారు. అందరూ బాగుండాలనేదే సీఎం కేసీఆర్ కోరుకుంటారని దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా రైతు బందు అధ్యక్షులు నందరెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేందర్ రెడ్డి, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Ajay Samrat : రుద్రంగి సినిమా నిజ జీవితం లో జరిగిన పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది.