Site icon NTV Telugu

Malla Reddy: రాహుల్ గాంధీ ఓ పప్పు.. మల్లారెడ్డి సెటైర్లు..

Malla Reddy

Malla Reddy

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప‌ప్పు అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. శనివారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొనుగోలు కేంద్రాన్నిమంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

Read Also: Alluri Sitarama Raju: ఏడాది పాటు అల్లూరి జయంతి ఉత్సవాలు..

రైతు సంఘర్షణ్‌ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు వాళ్ళ ప్రభుత్వం పాలిస్తున్న రెండు, మూడు రాష్ట్రాల్లో ఎంత మేర రైతులను ఆదుకుంటున్నారో చూసుకొని, మరీ… తెలంగాణకు రావాలంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు పప్పు రాహుల్ హయాంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా తిరిగి అధికారంలోకి రాలేక ఓడిపోయిందని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతోందని మంత్రి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్‌ తోనే సాధ్యమని.. అధికారంలోకి వచ్చేది ఒక్క టీఆర్‌ఎస్‌ సర్కారే న‌ని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Exit mobile version