Site icon NTV Telugu

Malla Reddy : నాకు 8 వందల ఎకరాల భూమి ఉంది

Malla Reddy

Malla Reddy

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ నిర్వహిస్తోన్న క్వశ్చన్‌ అవర్‌లో నేడు మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జర్నలిస్తులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ నా దగ్గర పర్‌ఫెక్ట్‌ పాన్లింగ్‌, హార్డ్‌వర్క్‌, డిసిప్లెన్‌ ఉంది. అప్పుడు టీడీపీలో గెలిచిన వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీలో ఎంపీగా గెలిచాక నేను ఒక్కడినే ఏకాకి అయ్యా. అందుకే నేను కూడా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరా.

Also Read : Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!

నేను కబ్జా చేయలేదు, నాకు 8 వందల ఎకరాల భూమి ఉంది. నేను రాజకీయాల్లోకి రాకముందే ఆస్తులు, భూములున్నాయి. ధరణిలో తప్పులుంటే సరిదిద్దుతున్నాం. సూరారంలో నాకు 56 ఎకరాలు ఉంది, చెరువును భూకబ్జా చేయలేదు. మైసమ్మగూడలో మునిగిపోయిన భవనాలు నావి కావు. నేను ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. నా దగ్గర ఉన్న ప్రతి గజం భూమికి రికార్డు ఉంది. ఐదారు ఎకరాలకు తప్పితే.. నేను రైతు బంధు తీసుకోను. రైతుబంధు నా అకౌంట్లో ఎంత పడుతుందో కూడా నాకు తెలియదు. రేవంత్‌ రెడ్డి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. రేవంత్‌ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్‌ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడు.’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Sound Party Trailer: బిగ్ బాస్ సన్నీ కొత్త సినిమా.. సౌండ్ అదిరేలానే ఉందే

Exit mobile version