తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ, మెడ్-టెక్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన హైదరాబాద్‌లో రెడీ అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సూల్తాన్‌పూర్‌లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించగా, తాజాగా సహజానంద్ సంస్థ ఇక్కడ భారీ స్టెంట్ తయారీ కర్మాగారంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించింది.
Minister KTR : ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం

Stent