KTR: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గంభీరావుపేట మండలం గోరంత్యాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించి, 11 గంటలకు ‘మన ఊరు.. మన బడి’లో నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఎల్లారెడ్డిపేట పాఠశాలలో 60 మంది హైస్కూల్ విద్యార్థులు కంప్యూటర్ ఛాంప్స్ కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ విద్యను అందించనున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.
Read also: Himalayas: పొంచి ఉన్న ముప్పు.. 65 శాతం వేగంగా కరుగుతున్న హిమాలయ హిమానీనదాలు….
మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో వెయ్యి మంది వికలాంగులకు పనిముట్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని ప్రారంభిస్తారు. సోమవారం జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు చెన్నిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Whatsapp: వావ్.. డైరెక్ట్ డెస్క్ టాప్ నుంచే వాట్సాప్ కాల్