KTR Tweet: కేంద్రమంత్రి గారు.. వీటికీ సమాధానం చెప్పండి.. నిర్మల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఆర్థిక అంశాల్లో నిపుణురాలైన నిర్మలా సీతారామన్ తాను చెబుతున్న అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించాలని కేటీఆర్ అన్నారు. 67 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 2014 ముందు వరకు 14 మంది ప్రధానులు మారారని.. అప్పటికి దేశ అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అదే మోడీ ప్రధాని అయ్యాక గత 8 ఏళ్లలో అప్పు రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరిపై అప్పు రూ.1.25 లక్షలకు చేరిందని చెప్పారు. జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తిని చూస్తే.. తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని ట్వీట్ ద్వారా తెలిపారు.
Chada Venkat Reddy: మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కూనీ అయ్యింది..
Also Read
తెలంగాణ జీఎస్డీపీ 23.5 శాతమేనని.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉందని వివరించారు. అదే దేశ అప్పులు, జీడీపీ నిష్పత్తి 59 శాతమని గుర్తు చేశారు. అంటే తెలంగాణ అప్పులే తక్కువని స్పష్టం చేశారు. భారత్‌లో కేవలం 2.5 శాతం జనాభా కలిగిన తెలంగాణ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే భారతదేశం 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎదిగి ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి కావాల్సినవి పాడైపోయిన డబుల్ ఇంజన్లు కావని.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Madam FM waxes eloquent on Fiscal prudence;
Till 2014, in 67 years 14 Prime Ministers of India together have raised a debt of ₹ 56 Lakh Crores
Then came PM Modi Ji; in the last 8 years alone India’s debt incremented by ₹ 100 Lakh Crores
Every Indian has a debt of ₹1.25 Lakh
— KTR (@KTRBRS) September 4, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!