Site icon NTV Telugu

KTR: నిందితులు ఎవరైనా చర్య తీసుకోండి.. అధికారులకు ఆదేశం

Minister Ktr 1

Minister Ktr 1

తెలంగాణ వ్యాప్తంగా ఆమ్నేషియా పబ్, అమ్మాయిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. కావాాలనే కేసును పక్కదారి పట్టిండానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖులు పిల్లలు ఉండటంతో కేసులో నిందితుల పేర్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై, ఇటు పోలీసులపై ప్రతిపక్షాలు ఒత్తడి పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా అమ్మాయిపై అత్యాచారం విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సింది హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీలను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. ఘటనతో సంబంధం ఉన్నవారు ఎవరైనా, ఎంతటి హోదా కలిగినవారైనా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ నెల 28న జూబ్లీహిల్స్ లోని ఆమ్నేషియా పబ్ కు పార్టీకి వెళ్లిన 16 ఏళ్ల మైనర్ బాలికను కార్లో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మే 28న జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే దాదాపు మూడు రోజుల తరువాత మే 31న ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Exit mobile version