ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలోని ఆయన ప్రసంగిస్తారు. అయితే.. ఈ మేరకు సభ విజయవంతం చేయడానికి టీఆర్‌ఎస్ శ్రేణులు జనసమీకరణ చేస్తున్నాయి. అంతేకాకుండా సభా ఏర్పాట్లు సాగుతున్నాయి.
అయితే గురువారం సభా ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మాలియా మున్సిపల్ పరిధిలో సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర మండలం సుంకేశాలలో ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్‌ను పరిశీలించారు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలునిచ్చారు.