Site icon NTV Telugu

స్వచ్ఛతలో అన్ని నగరాల కన్నా హైదరాబాద్‌ ముందుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సోమవారం మంత్రి కేటీఆర్‌ స్వచ్ఛ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తుందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మున్సిపాలిటీలో స్వచ్ఛ వాహనాలను ప్రారంభింస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ స్వచ్ఛతలో దేశంలోని అన్ని నగరాల కన్నా ముందు ఉందన్నారు.

సీఎం కేసీఆర్‌ సఫాయి కార్మికులను గౌరవిస్తు సఫాయన్న నీకు సలామన్న అని అన్నారని మంత్రి తెలిపారు. సఫాయి కార్మికులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. నగరంలో ఇంటింటికి తిరిగి కార్మికులు చెత్తను సేకరిస్తున్నారన్నారు. 1350 వాహనాలను ఈ ఒక్క రోజే ప్రారంభించామని తెలిపారు. దీంతో మొత్తం 5,700 పై చిలుకు వాహనాలు హైదరాబాద్ నగరంలో చెత్తను సేకరిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి పెద్ద విద్యుత్ తయారీ ప్లాంట్ ప్రారంభించుకున్నామని మంత్రి అన్నారు. నగరంలోని అన్ని మూలలకు చెత్త సేకరణ వాహనాలు వెళ్తున్నాయని, నగరంలోని గల్లీలన్నీ శుభ్రం అవుతున్నాయని కేటీఆర్‌ అన్నారు.

Exit mobile version