NTV Telugu Site icon

Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్‌ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు

Minister Ktr

Minister Ktr

Minister KTR: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌ ద్వారా భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్.

Read also: T20 World Cup: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్‌

ఇటీవల నిర్మించిన సింగరేణి కార్మికుల కోసం జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థ రూ. 229 కోట్ల వ్యయంతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం, జిల్లా కేంద్రంలోని వేశాలపల్లిలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33.08 కోట్లతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బీ అతిథి గృహం, గణపురం మండల కేంద్రంలో రూ. రూ.4 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.4 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల భవనాన్ని, రూ.14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయాన్ని, వికలాంగుల సౌకర్యార్థం రూ.23 లక్షలతో వికలాంగుల కోసం నూతన భవనాలు నిర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అంతే కాకుండా.. రూ.1.50 కోట్లతో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇక జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.4.50 కోట్లతో చేపట్టే సింగరేణి మినీ స్టేడియం పనులు, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో సాయం త్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సభికులనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Read also: Srisai Chalisa: శ్రీసాయి చాలీసా వింటే అనారోగ్య సమస్యలు తొలగిపోవాతాయి

ఇక హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లికి ఈ నెల 27న ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వెళ్లనున్నారు. అయితే.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు నీరందించే పైపులైన్‌ పనులను శంకుస్థాపన, సుమారు రూ.133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సోడాషపల్లి శివారులో రైతు కృతజ్ఞతా సభలో పాల్గొననున్నారు.
Putra Ganapathi Vratam: ఈ స్తోత్రం వింటే సంతాన అవరోధాలన్నీ తొలగిపోతాయి

Show comments