NTV Telugu Site icon

Minister KTR: కాంగ్రెస్ ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ…

Minister Ktr Brs

Minister Ktr Brs

Minister KTR: కాంగ్రెస్ అది ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కేటీఆర్ రోడ్ షో చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీఓడు ఇయ్యాల పొద్దున్న ఆర్డర్ ఇచ్చి రైతుబంధు ఆపించారని మండిపడ్డారు. దేమో ఇచ్చుకోవచ్చన్నరు ఇప్పుడు ఈసీ మీద ఒత్తిడి తెచ్చి రైతు బందు ఆపిచ్చిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం రాకముందే రైతుబంధు కాటగలిపిండ్రని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దిక్కుమాలిన పార్టీలకు ఓటేస్తే ఆగమైతం అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులు బీద బిక్కీలే వారికి 3 గంటల కరెంటు చాలంటున్నడు రేవంత్ రెడ్డి అని అన్నారు. రైతుబంధు రైతుకిస్తే, కౌలుదారుకు ఇయ్యనంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే 11 ఛాన్స్ లిచ్చినం ప్రజల జీవితాలను ఆగం చేసిండ్రని అన్నారు. కాంగ్రెస్ అదేమైనా కొత్త పార్టీనా, చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అన్నారు.

Read also: MLA Laxmareddy: కేసీఆర్ అంటే చేతల మనిషి… ఎన్నికల ప్రచారంలో లక్ష్మారెడ్డి

సీఎంగా కేసీఆర్ రైతుబంధు స్టార్ట్ చేసిండు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. ఒకసారి తప్పుచేసి 50 ఏండ్లు బాధపడ్డం, అదే తప్పు మరోసారి చేయద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. డబ్బాలో ఓటేసే ముందుమిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని ఓటేయ్యండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ఆలోచించాలని తెలిపారు. ఆగం కావద్దు అని తెలిపారు. రైతుబంధు కావాల్నా, రాబంధు కాంగ్రెస్ కావాల్నా బీజేపీ, కాంగ్రెస్ డిల్లీ నేతలంతా వచ్చి ఒక్క కేసీఆర్ బొండిగ పిసకాలని చూస్తున్నారని తెలిపారు. 55 ఏండ్లు భస్మాసుర హస్తం మనలను నాశనం చేసిందన్నారు. కత్తి ఒకనికిచ్చి యుద్దం మమ్మల్ని చేయమంటే మాతోని కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Kishan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు