Site icon NTV Telugu

KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతాం.. మాటిస్తున్నమంటూ కేటీఆర్‌ ట్వీట్‌

Ktr

Ktr

KTR Tweet: దీపస్తంభంగా తెలంగాణను నిలుపుతామని మాటిస్తున్నమంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాధన ఉద్యమం అత్యున్నతమైనదని, ప్రజాస్వామిక పోరాటాల నాయకుడని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. స్వపరిపాలన మాత్రమే కాకుండా ప్రజలందరికీ సుపరిపాలన ఫలాలు అందించడమే మన అమర వీరుల ఆశయమన్నారు. దశాబ్దాలుగా పేదలందరికి పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరం చేస్తామన్నారు. అమర వీరుల ఆశయాలే స్ఫూర్తి అని, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరి అని, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లని, తొమ్మిదేళ్ల ప్రగతికి నిదర్శనం చేసిన మహాయజ్ఞమని తెలిపారు.

Read also: Malaika Arora Hot Pics: వయసుతో పాటు పెరుగుతోన్న అందం.. మలైకా అరోరా హాట్ పిక్స్!

దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరవని, తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్ప కాలంలో అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చి రాబోయే వందేళ్లకు బలమైన పునాది వేసిందన్నారు. త్యాగధనులను ఎప్పటికీ మా గుండెల్లో నిలుపుకుంటామని, హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించిన అమరవీరుల స్మారక చిహ్నంగా.. వెలుగుతున్న దీపం సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. లక్ష్యం కోల్పోయిన భారతదేశానికి బాటలు వేసేందుకు తెలంగాణను దీటుగా నిలుపుతామని చెబుతున్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జై తెలంగాణ, జై భారత్ అంటూ చేసిన మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్‌ గా మారింది.

Exit mobile version