Site icon NTV Telugu

Minister KTR : విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలే

రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజీలతో, కొత్తకొత్త ఆలోచనలతో జపాన్‌ లాంటి దేశాలు ముందున్నాయి. అందుకు కారణం అక్కడి విద్యా విధానం. అయితే టెక్నాలజీలో ముందున్న దేశాల పక్కన మన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇందుకు విద్యా విధానంలో మార్పుల తప్పనిసరి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేయాలి. ఈ విధంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థలు పట్ల టీచర్లు కి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారకపోతే వెనుకబడి పోతామన్నారు.

మన కంటే నాలుగు రెట్లు ముందు జపాన్ ఆలోచనలు ఉన్నాయని, అందుకే వాళ్ళు ముందు ఉన్నారన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలను డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా అని టార్చర్ మొదలు పెడతారని, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు లో రుద్దే రద్దుడుకు మరొక ఆలోచన రానివ్వదన్నారు. అటువంటి విధానం దేశానికి రాష్ట్రానికి అసలు మంచిది కాదని ఆయన అన్నారు. చిన్న పిల్లలలో తెలుసుకోవాల్సిన ఆసక్తి చాలా ఉంటుందని, తెలంగాణలో ఆవిష్కరణలకు పెద్ద పీట వేశామన్నారు. తెలంగాణలో విద్యా యజ్ఞం ప్రారంభం అయిందని, నా చిన్నతనములో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు చాలా ప్రయోగాలు చేసేవాళ్ళమని ఆయన గుర్తు చేసుకున్నారు.

https://ntvtelugu.com/palla-rajeshwar-reddy-fired-on-ts-bjp-leaders/

Exit mobile version