Site icon NTV Telugu

KTR Tweet: పార్లమెంట్‌ లో పదాల నిషేధంపై సీరియస్‌ .. ఉదహరిస్తూ ట్వీట్‌

Ktr Tweet In Bjp

Ktr Tweet In Bjp

కొద్దిరోజుల క్రితం ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర్కార్ ఇప్పుడు.. పార్లమెంట్‌లో కొన్ని పదాలను వాడకూడదంటూ నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్వీటర్ వేదికగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. కేంద్ర ఉత్త‌ర్వుల‌పై మండిప‌డుతూ ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నాన్ ప‌ర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ) గ‌వ‌ర్న‌మెంట్ పార్ల‌మెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉద‌హ‌రిస్తూ ట్వీట్ చేయడం చర్చకు దారితీస్తోంది. ప్రధానిపై విరుచుకుపడుతూ.. ఆందోళ‌న‌కారుల‌ను ఆందోళ‌న్ జీవి అని ప్ర‌ధాని పిల‌వ‌డం వారి పార్ల‌మెంట్ భాష అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఓమంత్రి వ్యాఖ్యానించిన గోలి మారో సాలోం కో అనే వ్యాఖ్యం.. 80-20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించడం.. మ‌హాత్మాగాంధీని కించ‌ప‌రిచిన బీజేపీ ఎంపీ తీరుపై, ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను అవ‌మాన‌ప‌రుస్తూ వారిని టెర్ర‌రిస్టులు అని సంబోధించడంపై వారి పార్ల‌మెంట్ భాష అని పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

read also:Bonalu 2022: రేపే లష్కర్ బోనాలు.. భారీ బందోబస్తు, ట్రాఫిక్‌ ఆంక్షలు..

అయితే.. జూలై సోమవారం నుంచి (18వ) తేదీ నుంచి జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో లోక్‌ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్‌ సభ సెక్రటేరియట్‌ ఒక బుక్‌లెట్‌ను ఇటీవ‌లే విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఇకపై జుమ్లాజీవి, కొవిడ్‌ స్పైడర్‌, స్నూప్‌గేట్‌, వంటి ఇంగ్లీష్‌ పదాలనే కాకుండా.. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను పార్లమెంట్‌లో నిషేధించింది. కాగా.. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వాటితోపాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్‌, గూన్స్‌, అప్‌మాన్‌, కాలా బజారీ, దలాల్‌, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్‌, లాలీపాప్‌, విశ్వాస్‌ఘాత్‌, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version