అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జీఎస్‌డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు.
దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ, కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన కేసీఆర్ పాలనకు కేటీఆర్ థాంక్యూ చెప్పారు.
