Minister KTR: నేడు కేటీఆర్ రోడ్‌షో రద్దు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కొత్తగూడెంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ శనివారం నిర్వహించిన రోడ్ సక్ష రద్దయింది. ఇతర ప్రాంతాల్లో పర్యటన ఖరారు కావడంతో ఇక్కడి రోడ్ షో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. రేపు (ఆదివారం) భద్రాచలం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో రోడ్ షోను నిర్వహించాల్సి ఉంది. అయితే.. అందరి దృష్టి కామారెడ్డి సీటుపైనే ఉంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇదే కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ మెజారిటీ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సమన్వయ కమిటీ సభ్యులు కలిసి అత్యధిక మెజారిటీ కోసం కృషి చేస్తున్నారు. నామినేషన్ తో పాటు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది…బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు, బీబీపేట్ మండలాల్లో కేటీఆర్ పర్యటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలు ప్రజలతో ముఖాముఖి అన్నట్లుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ప్రసంగాలు వింటున్నారు. కేటీఆర్ చెప్పిన దాని గురించి ఆలోచించి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులోభాగంగా శనివారం ఉదయం 11 గంటలకు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి నుంచి రోడ్‌షో నిర్వహించాల్సివుంది. ఓపెన్ టాప్ బస్సులో పలు గ్రామాల ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీల చర్యలను, ఆ పార్టీల తీరును కేటీఆర్ తనదైన శైలిలో తిప్పికొట్టనున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ రాక సందర్భంగా రానున్న ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుందో వివరిస్తామన్నారు. సీఎం ప్రచార సభ మాదిరిగానే రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఇప్పటికే శ్రేణులు తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు బీబీపేట్ మండలం కాచాపూర్, మాందాపూర్, జనగామ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బీబీపేట్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించే విధంగా షెడ్యూల్ ఉండగా.. వేరే పర్యటన నేపథ్యంలో కామారెడ్డి పర్యటన ఇవాళ రద్దు చేసుకున్నారు. మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి, కామారెడ్డి మండలాల్లో ఇప్పటికే కుల సంఘాలు, గ్రామ పంచాయతీల వారీగా పెద్ద ఎత్తున తీర్మానాలు చేశారు.
Koti Deepotsavam 2023 Day 5: ఐదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
తాజావార్తలు
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!