Site icon NTV Telugu

KTR Road Show: ఈనెల 20 వరకు కేటీఆర్‌ రోడ్ షో.. షెడ్యూల్ ఇదీ..

Ktr

Ktr

KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొన్నటి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా హైదరాబాద్ నగరంపైనే పెట్టాడు. పెద్ద నగరంపై నియంత్రణను కొనసాగించేందుకు తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులోభాగంగా నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. నిన్నటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు.

రెండు నియోజకవర్గాల్లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. తొలి విడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 నియోజకవర్గాల్లో నేటి నుంచి ఈ నెల 20 వరకు రోడ్ షోలు నిర్వహించేందుకు కేటీఆర్ ప్లాన్ చేశారు. ఇవాళ నగరంలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 19న అంబర్‌పేట, ముషీరాబాద్‌, 20న మంత్రి కేటీఆర్‌ ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌లో పర్యటించనున్నారు.

షెడ్యూల్ ఇదీ..

• 16-11-2023- కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌..

• 17-11-2023 – జూబ్లీహిల్స్, ఖైరతాబాద్.

• 18-11-2023 – గోషామహల్, నాంపల్లి.

• 19-11-2023 – అంబర్ పేట్, ముషీరాబాద్.

• 20-11-2023 – ఉప్పల్, ఎల్బీ నగర్‌లో పర్యటించనున్నారు.

ఇక తొమ్మిదిన్నరేళ్లలో యూనివర్సల్ సిటీ విజన్ కు రోల్ మోడల్ గా కేటీఆర్ నిలుస్తున్నాడు. స్థలానికి, సందర్భానికి తగ్గట్టుగా తన ప్రవర్తనను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వీటన్నింటిని కలుపుకుని గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లు, 2018 శాసనసభ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో 14 సీట్లు ఒంటిచేత్తో గెలుపొంది యువ నాయకుడిగా కేటీఆర్ కింగ్ మేకర్ అయ్యారు. డిసెంబర్ 2020 GHMC ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసి బల్దియా తనదైన ముద్ర వేశారు. ఇందులోభాగంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు తొలి విడతగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతిరోజూ రెండు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటారు.
Mohammed Shami Records: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాలే!

Exit mobile version