Site icon NTV Telugu

Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు

Ktr Kavitha

Ktr Kavitha

Minister KTR Press Meet On ED Notice To MLC Kavitha: ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈనేపథ్యంలో కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 11, 12 మంది మా నాయకుల మీద ఈడి, సీబీఐ, ఐటీ దాడులు కేంద్రం చేయిస్తుందని మండిపడ్డారు. కవితకు ఈడి సమన్ లు కాదు మోడీ సమన్ లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా అవినీతి పరులు అని మేము మాత్రమే నీతి వంతులము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. Lic డబ్బులు అవిరి అయ్యాయి అయినా దేశ ప్రధాని ఉలకడు పలకడు అదేంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 ఎయిర్‌ పోర్టులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. మోడీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌. మూడు వేల కోట్ల హెరాయిన్ ఆయన పోర్ట్ లో దొరికిన చర్యలు లేవు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే.. ప్రతి పక్షాలు లేకుండా చేయాలి అనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడి దాడులు వంద శాతం విపక్షాల మీద నే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మంది బీఆర్ఎస్ నేతలపై ED, CBI దాడులు చేశారని, ఈడీ సమన్లు కాదు.. ఇవి మోడీ సమన్లు అంటూ నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్‌. ఈడీ తొలుబొమ్మ , నీతి లేని పాలన.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు అంటూ ఆరోపణలు గుప్పించారు.

Read also: Naveen murder case: కత్తిని ముందే లవర్‌కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్‌ శరీరబాగాలను హసన్ ఇంట్లో..

రెండు వేల ఒక వంద కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్స్ దొరికినా గౌతమ్ ఆదానీ ని విచారించే ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ చౌదరి, సీఎం రమేశ్ లపై కేసులు ఏమయ్యాయి ? అంటూ ప్రశ్నించారు. జీ20 కాదు. జీ 2 జీ అంటే గౌతమ్ టూ గోటబయ్ అంటూ మండిపడ్డారు మంత్రి. మోడీ చేతిలో ఈడీ కీలు బొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఏదో జరుగుతుందంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అన్నారు. నీతిలేని పాలనకు కేంద్రం తీరు పర్యాయపదంగా మారింది అన్నారు. గౌతం ఆదానీ ఎవరి బినామీ అని దేశమంతా అడుగుతోంది. అదానీ మోడీ బినామీ అని చిన్న పిల్లాడు కూడా చెబుతున్నాడు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా మోడీ, నిర్మలా ఉలకరు పలకరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి 6 పోర్టులు ఇవ్వడంపై నీతి అయోగ్‌ తప్పుపట్టిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అయినా అదానీపై ఎలాంటి కేసులు ఉండవు. అదానీ పోర్టుల్లో హెరాయిన్‌ దొరికినా కేసు పెట్టరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబల్ ఇంజన్ అంటే ఒక ఇంజన్ మోడీ ఇంకో ఇంజన్ అదానీ అంటూ ఆరోపించారు. ఇక్కడ ఉన్న ఓ వ్యక్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ లు ఇచ్చి లోబర్చుకున్నారని మండిపడ్డారు. బీజేపీ లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా నా? అంటూ ప్రశ్నించారు. సుజన చౌదరి కేసు, హిమంత బిస్వా శర్మ ల కేసు ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు ఏర్పాట్లు ఉండాలని పాలసీ.. అది కాదని 6 పోర్ట్ లు అదానీ కి ఇస్తే అది స్కాం అట అంటూ నిప్పలు చెరిగారు.

Exit mobile version