NTV Telugu Site icon

Minister KTR: ఫెర్రింగ్ లాబోరేటరీస్‌ ప్లాంట్‌తో ఉపాధి

Ktr Hd

Ktr Hd

హైదరాబాద్‌ ప్రపంచస్థాయి సంస్ధలకు వేదిక అవుతోంది. అనేక అగ్రగామి సాఫ్ట్ వేర్, ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా షామీర్‌పేట్‌ లోని TSIIC బయోటెక్ పార్క్ లో ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ ను ప్రారంభించారు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫెర్రింగ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 30 బిలియన్ యూరో పెట్టుబడితో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు కల్పించారు. స్విజ్జర్లాండ్ వేదికగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయి. తల్లి, బిడ్డల ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఇక్కడ తయారు చేస్తారన్నారు. మహిళల ఆరోగ్య కోసం ఫెర్రింగ్ ఫార్మా కృషి చేయడం అభినందనీయం.

జీనోమ్ వ్యాలీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో కొనసాగుతుంది. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ మరింత పురోగమిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ రంగంలో హైదరాబాద్ మరింత ముందుంటుందన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్ లో హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఫెర్రింగ్ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు.

Read Also: టీఆర్ఎస్ సర్వేలో నిలిచేది ఎవరు ? వారసుల కోసం సిట్టింగులు ఆరాటం