NTV Telugu Site icon

Minister KTR: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బహిరంగ లేఖ

Ktr Open Letter

Ktr Open Letter

Minister KTR Open Letter To Central Govt Over Irrigation Projects: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో.. కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తోందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం పై అంతులేని వివక్ష కనబరుస్తోందని విమర్శించారు. నదీ జలాల వినియోగం నుంచి మొదలుకొని ప్రాజెక్టుల నిర్మాణం దాకా.. అన్నింట్లోనూ అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్రంపై విరుచుకుపడ్డారు.

Pawan Kalyan: సీఐ అంజుయాదవ్‌పై పవన్‌ సీరియస్‌.. అక్కడికే వచ్చి తేల్చుకుంటా..!

9 సంవత్సరాలు అయినా.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్‌ను తేల్చకుండా, కేంద్రం తాత్సారం చేస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని దుయ్యబట్టారు. కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా.. తెలంగాణ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే శక్తులపై తాము రాజీ లేకుండా పోరాడుతామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!

అంతకుముందు.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కూడా కేటీఆర్ మండిపడ్డారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలా? లేక మూడు గంటల కరెంటు చాలంటున్న మోసకారి రాబందు కావాలా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని, నేడు మూడు పూటలు కరెంటు దండగ అని చోటా చంద్రబాబు అంటున్నాడని ట్విటర్ మాధ్యమంగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపేనని.. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలియని రేవంత్‌ని నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని పేర్కొన్నారు.