Site icon NTV Telugu

KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్‌.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..

Ktr Seetakka

Ktr Seetakka

KTR: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Read also: Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్‌కర్

అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప ఆలయానికి చేరుకుని శిల్ప సంపదను వీక్షించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రామప్ప చెరువు గట్టు వద్దకు చేరుకుని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న అనంతరం ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీకి, నిర్మించనున్న సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిరానికి శంకుస్థాపన చేస్తారు. రూ.15 లక్షలతో, జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు. అక్కడి నుంచి సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…

Exit mobile version