Site icon NTV Telugu

KTR: హైదరాబాద్‌కు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం

Ktr

Ktr

భాగ్యనగరానికి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మరో మణిహారం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హితమైన, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అయితే.. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు. ఈసందర్భంగా.. స్థానికంగా ఉండే వ్యక్తులు ఆఫీస్ కు సైకిల్ పై వేళ్లేందుకు ఉపయోగపడాలని ముఖ్య ఉద్దేంతో సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక దుబాయ్, జర్మనీ లాంటి విదేశాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసి సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో.. నానక్ రామ్ గూడ వద్ద సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.

ఈనేపథ్యంలో.. గత ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్‌ కొరియాలో సైక్లింగ్‌ ట్రాక్‌ ఉందని, హైవే మధ్యలో సోలార్‌ ప్యాన్లతో కట్టారని, చూడడానికి బాగుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక భారత్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు, ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్‌ కొరియాకు వ్యక్తిగతం పంపామని, ఆ తర్వాత దుబాయిలో బాగుందంటే వెళ్లి అక్కడి మోడల్‌ను స్టడీ చేశారన్నారు. అయితే.. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని.. దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు.. ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి.. ఆఫీస్‌ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు.
Digvijay Singh: కేసీఆర్, జగన్‌లపై సెటైర్లు.. గులాంపై గుర్రు

Exit mobile version