Site icon NTV Telugu

KTR: శుభవార్త .. త్వరలో కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు

Ktr New Pension

Ktr New Pension

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ శుభ‌వార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నేడు న‌గ‌రంలో కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌ మాట్లాడుతూ.. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘మీ శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల మీదుగా.. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీమే.. మీ కార్పొరేటరే వచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్‌ కాకుండా ఇచ్చే బాధ్యత మాద‌ని అన్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం రాక ముందు ఈ రాష్ట్రంలో 29లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేదని గుర్తు చేసారు. అప్పుడు రూ.200, రూ.500 పెన్షన్‌ వచ్చేదని అన్నారు కేటీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 40లక్షల మందికి పెన్షన్లు వస్తున్నయని తెలిపారు. రూ.200 పెన్షన్‌ పది రెట్లు పెరిగి రూ.2000 అయ్యిందని అన్నారు. రూ.500 పెన్షన్‌ ఆరు రెట్లు పెరిగి.. రూ.3వేలు అయ్యిందని గుర్తు చేసారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం.. ఆ నాడు ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.800కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వంలో రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతోంద‌ని అన్నారు. మరో మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉన్న పేదవారి కోసం.. మీ మొఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యమ‌ని ఈ సంద‌ర్బంగా కేటీఆర్ అన్నారు.

Samantha :చైతూ డేటింగ్ పై సమంత సీరియస్..!

Exit mobile version