NTV Telugu Site icon

Rs 1100 crore investment: తెలంగాణలో మరో రూ.1100 కోట్ల పెట్టుబడులు.. ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన

Ktr

Ktr

తెలంగాణలో పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది… హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. కొత్తగా సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా.. వీటి ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది… జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని.. అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని తెలిపారు.. లైఫ్‌ సైన్సెస్ రంగంలో పెట్టుబడులతో దేశంలోనే జీనోమ్ వ్యాలీ కీలకంగా ఎదిగిందన్న మంత్రి.. జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకమైందని పేర్కొన్నారు..

Read Also: JioFiber Double Festival Bonanza offers: జియో బంపరాఫర్‌.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో..!

జీవ ఔషధ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రయాణం కొనసాగుతుందన్నారు.. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణాన్ని సాగిస్తున్నామని.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, కంపెనీల విస్తరణతో రానున్న రోజుల్లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్పేస్‌ అదనంగా తోడవుతుందన్నారు. రూ. 1100కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ఐదు ప్రాజక్టుల ద్వారా మూడువేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.