Rs 1100 crore investment: తెలంగాణలో మరో రూ.1100 కోట్ల పెట్టుబడులు.. ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది… హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. కొత్తగా సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా.. వీటి ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది… జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్ సహా ఐదు ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని.. అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని తెలిపారు.. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులతో దేశంలోనే జీనోమ్ వ్యాలీ కీలకంగా ఎదిగిందన్న మంత్రి.. జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకమైందని పేర్కొన్నారు..
Read Also: JioFiber Double Festival Bonanza offers: జియో బంపరాఫర్.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో..!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
జీవ ఔషధ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రయాణం కొనసాగుతుందన్నారు.. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణాన్ని సాగిస్తున్నామని.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, కంపెనీల విస్తరణతో రానున్న రోజుల్లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్పేస్ అదనంగా తోడవుతుందన్నారు. రూ. 1100కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ ఐదు ప్రాజక్టుల ద్వారా మూడువేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్.
Delighted to have inaugurated and launched 5 new projects in @Genomevalley @TS_LifeSciences with a cumulative investment of ₹ 1100 crores and employment potential of about 3000 people pic.twitter.com/8v6D4uybZV
— KTR (@KTRBRS) October 18, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!