Site icon NTV Telugu

Minister KTR : హైదరాబాద్‌ ఐటీ కిరీటంలో.. మరో ప్రముఖ సంస్థ

Minister Ktr

Minister Ktr

దేశంలోనే తెలంగాణ ఐటీ రంగంలో మున్ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు అదే బాటలో ప్రముఖ సంస్థ ఎక్స్‌పీరియన్‌ చేరింది. ఈ సంస్థ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. అయితే.. తాజాగా ఈ సంస్థ హైదరాబాద్‌ వేదికగా ఎక్స్‌పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం విశేషం. అయితే ఈ ఎక్స్‌పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్ రంగంలో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న సంస్థ‌గా ఎక్స్‌పీరియ‌న్‌కు గుర్తింపు ఉంది. అయితే ఇలాంటి ప్రముఖ కంపెనీ హైదరాబాద్‌ లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం.. తెలంగాణ ఐటీ కిరీటంలోకి మరో వజ్రం వచ్చి చేరినట్లైందని సోషల్‌ మీడియాతో పలువురు కామెంట్లు పెడుతున్నారు.

 

Exit mobile version