KTR Uncle Please: బాలల దినోత్సవం డే సందర్భంగా ఓ బుడ్డోడు అడిగిన కోరికకు మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ అంకుల్ నాదో చిన్న కోరిక అంటూ.. ఆ చిన్నారి చేసిన రిక్వెస్ట్‌కు స్పందించిన మంత్రి.. ఆ కోరికను తీర్చే దిశగా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్ల నుంచి ఉన్న సమస్యకు ఆ బుడ్డోడి వల్ల షరిష్కారం దొరికినట్టైంది.
Hey @KTRTRS Sir
Here is a cute boy requesting you something on this #ChildrensDay
In Short, we area living in the Hyderabad city (Golden city Colony,Pillar no:248) from last 5 years and waiting for Drinking water pipeline…Paying every other taxes.
Are we asking too much?? pic.twitter.com/XMawmcyD50
— Patel 🏹 (@Patelshyd) November 14, 2022
హైదరాబాద్ నగరంలో గోల్డెన్ సిటీ కాలనీకి చెందిన ఉమర్ అనే చిన్నారి ఓ ప్లకార్డు పట్టుకుని తన సమస్యను వీడియో రూపంలో చిత్రీకరించాడు. ఆ ప్లకార్టులో.. “చిల్డ్రన్స్ డే సందర్భంగా నాదొక చిన్న కోరిక కేటీఆర్ అంకుల్.. మా కాలనీకి 5 సంవత్సరాలు నీళ్లు రావటంలేదు. మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్లీజ్ అంకుల్ మాకు సాయం చేయండి..” అని రాసుంది. ఆ వీడియోను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆ చిన్నారి వీడియోను జలమండలి ఎండీ దానకిషోర్‌కు ట్వీట్ చేస్తూ.. సదరు కాలనీకి వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గోల్డెన్ కాలనీకి స్వయంగా జలమండలి ఎండీ దానకిశోర్ వెళ్లి వీడియోలో ఉన్న చిన్నారి ఉమర్‌ను కలిశారు. సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.
Well done MD Garu 👍 https://t.co/ukjs32Tzuo
— KTR (@KTRTRS) November 14, 2022
గోల్డెన్ కాలనీకి తాగునీటి సరఫరా లైన్ కోసం ఇప్పటికే 2.85 కోట్లు మంజూరు చేశామని తెలిపిన దాన కిశోర్ వర్షాకాలం కారణంగా పైప్‌లైన్ పనులు వాయిదా పడ్డాయని, రెండు వారాల్లో కాలనీకి తాగునీరు అందిస్తామని మాట ఇచ్చారు. ఇక అప్పటి వరకు ట్యాంకర్లతో కాలనీకి నీరు అందిస్తామని దాన కిశోర్ హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా ఉన్న సమస్యను పరిష్కారమయ్యే చేసిన చిన్నారి ఉమర్‌ను కాలనీవాసులు తెగ పొగిడేస్తున్నారు. అయితే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ బుడ్డోడి ట్వీట్ వైరల్ అయ్యింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ చిన్నోడు చేసిన చిన్ని ప్రయత్నానికి ప్రభుత్వమే కదిలిందంటూ కాలనీవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
World Population: 8 బిలియన్లకు ప్రపంచ జనాభా.. చైనాను అధిగమించనున్న భారత్!
