Telangana IT and Industries Minister KTR laid the foundation for the Kitex unit at the Kakatiya Mega Textile Park Warangal, on Saturday.
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్‌ను కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా కంపెనీలు ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగిందని, రాబోయే 18 నెలల్లో 20 వేల ఉద్యోగాలు వచ్చే కంపెనీలు అందుబాటు లోకి వస్తాయని ఆయన తెలిపారు. వరంగల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి ఏడాది పూర్తి చేసుకుందని, ఆ వేడుకలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వరంగల్ లో ఉన్న వసతులతో కొత్త కంపెనీ వరంగల్‌కి వస్తున్నాయని, ఐటీ కంపెనీలు హైదరాబాద్ తరువాత వరంగల్ కి ప్రాధాన్యత ఇస్తున్నారని, సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పల్లెలు, పట్టణాలు అన్నిటినీ అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రక్కరం.. స్థూల ఉత్పత్తి 150 శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు.