ఎంఎస్ఎంఈలకు మరింత సహకారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి అవి తిరిగి గాడిన పడే ప్రయత్నం చేయాలన్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు, రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందన్న కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగ కంపెనీలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
ఇక, స్వయం సహాయక సంఘాలు గత రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ శాతాన్ని కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ మరియు వి-హబ్ లో భాగస్వాములు కావాలని.. రాష్ట్రంలో ఇండియన్ బ్యాంక్ మరింతగా విస్తరించి అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి, అవి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు కేటీఆర్.
Also Read
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్‌ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!