NTV Telugu Site icon

Minister KTR: పేపర్‌ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

Ktr

Ktr

Minister KTR: రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్టుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బండి అరెస్ట్ పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనడానికి ఆ ట్వీట్ మరో నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్‌ వైరల్ చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో తెలిపారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కుట్రకు సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి వెళ్లే వారికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ అమాయక విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.

Read also: Identify Fake Land Registry: మీ భూమి రిజస్ట్రేషన్ నిజమైనదా లేదా నకిలీదా ?

ఇది ఇలా ఉండగా.. మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌ చేశారు. గత కొంతకాలంగా విపరీతమైన ధరల పెరుగుదలతో సామాన్యుల జీవనం అతలాకుతలమైంది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాల్ట్ పీరం..పప్పు పీరం..పెట్రోల్ పీరం..డీజిల్ పీరం..గ్యాస్ పీరం..దోశ పీరం..ఆల్ పీరం..పిరం..జనం అంతా గరం..గరం’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకే మోడీ డియర్ ప్రధాని అని మంత్రి సెటైర్లు వేశారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్సులను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగాయి? వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను వారు తమతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు.


Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌