NTV Telugu Site icon

Minister KTR: అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలి..!

Minister Ktr

Minister Ktr

Minister KTR: గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలిసిందని, దాడులు సరికావని, మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి… ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలన్నారు. మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కోట్ల రూపాయలు పెట్టీ మునుగోడు ప్రజలను కొనవచ్చు అని రాజ్ గోపాల్ రెడ్డి అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నుంచి చాలా కుట్రలు రాబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనైపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గువ్వల బాలరాజుపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. మొన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి కానీ.. కత్తిపోట్లు, రాళ్ల దాడులు మంచిది కాదన్నారు.
మునుగోడు విచిత్రమైన పరిస్థితి చూసామన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఎందుకు ఉప ఎన్నిక తెచ్చాడు అనేది ఆయనకే తెలవాలని అన్నారు.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరిన కాంగ్రెస్ పార్టీ కైనా తెలియాలని వ్యంగాస్త్రం వేశారు. పాల్వాయి గోవర్థన్ రెడ్డి అప్పట్లో ఏ పార్టీలోకి వెళ్ళను అని తేల్చి చెప్పారు.. రాజ్ గోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినప్పడు కాంగ్రెస్ నుంచి పోతున్నారు…వస్తున్నారని ఎద్దేవ చేశారు. చాలా కుట్రలు రాబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం పోయింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటువంటివి ఇంకా రెండు… మూడు జరుగుతాయని తెలిపారు. బీజేపీ,ఏఐసిసి ఆఫీసులో తయారు చేసిన వంటలతో తెలంగాణ ప్రజలను గందర గోళం చేసే ప్రయత్నం చేస్తారని అన్నారు. ధన రాజకీయాలను తిరస్కరించాలని ప్రజలకు సూచించారు కేటీఆర్. రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని ధన మదాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. గువ్వల బాలరాజు పై దాడి సరికాదని …మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేశారని తెలిపారు. ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని గుర్తుచేశారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అపోలో హాస్పిటల్ లో బాలరాజు చికిత్స పొందుతున్నాడని అన్నారు.
Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ వచ్చేసింది!