కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న తుక్కుగూలో నిర్వహించి భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్.. అంతా తుప్పు… తుక్కుతుక్కె అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పదవులు అమ్ముకునే ఓ చిల్లర పార్టీ. ఓ దౌర్భాగ్య పార్టీ బీజేపీ. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తి అవినీతి మయం. ముఖ్యమంత్రి పదవిని అర్రస్ పాట పడేది అవినీతి పార్టీ. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం. రాజనీతిజ్ఞత తెలంగాణ కోరుకుంటున్నారు. ఎనిమిదేళ్ళలో తెలంగాణకు ఏమి చేశారని ప్రశ్నిస్తే సమాధానం లేదని ఆయన మండిపడ్డారు. నిజాం వారసులు కూడా బీజేపీ నేతల మాదిరిగా తలుచుకోరేమో. 3లక్షల 65 వేల 797 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి కట్టింది. లక్షా 68 వేల కోట్లు మాత్రమే తెలంగాణకు తిరిగి నిధులు వచ్చాయి.
బీజేపీ ఎంపీ తెలంగాణకు 3 లక్షల 94 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. బీజేపీ నేతలది అబద్దపు బ్రతుకా, అసత్యాలు, అర్ధ సత్యాల బ్రతుకు..? అంటూ మంత్రి కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు బీజేపీ పాలిత రాష్టాల్లో ఉపయోగపడటం లేదా? బీజేపికి సొంత విధానమే లేదు. మిషన్ భగీరథ కు 19వేల కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెబితే 19 పైసలు కూడా కేంద్రం ఇవ్వలేదు. దేశంలో ని 28 రాష్టాల్లో అప్పుల నిష్పత్తిలో కింది నుంచి ఐదో స్థానం. 23.5 శాతం. పరిమితికి లోబడి తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసింది. 56 లక్షల కోట్లు దేశం అప్పులు ఉంటే.. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంద లక్ష కోట్లు అప్పులు చేసింది. 28 లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలపై ధరలు పెంచి దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
