Site icon NTV Telugu

Gift a Smile: విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసిన కేటీఆర్‌

Ktr Sirisilla

Ktr Sirisilla

Gift a Smile: రాజన్న సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఊహించని విధంగా ఎన్నో విద్యాసంస్థలను ప్రారంభించుకున్నామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని, విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామని ‘మన ఊరు-మన బడి’ కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు.

Read also: Bhuvaneshwar Kumar: భువిపై విమర్శలు.. మద్దతుగా ఆసీస్ మాజీ ప్లేయర్

అంతేకాకుండా.. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని.. రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని చెప్పారు. ఇక దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్‌ సైకిళ్లు అందించామని తెలిపారు. అయితే.. ప్రస్తుతం పేద విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ అందిస్తున్నామని చెప్పారు. ఈనేపథ్యంలో.. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేస్తున్నాని వెల్లడించారు. ఈసందర్బంగా.. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. అంతేకాకుండా.. విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. ఇక విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు.
Bhuvaneshwar Kumar: భువిపై విమర్శలు.. మద్దతుగా ఆసీస్ మాజీ ప్లేయర్

Exit mobile version