NTV Telugu Site icon

KTR: మోడీజీ.. ఆశాఖలో ఓబీసీలను ఏర్పాటు చేయండి

Modi Ktr

Modi Ktr

KTR Demands PM Modi: మంత్రి కేటీఆర్‌ కేంద్రం పై విరుచుకుపడ్డారు. పీఎం మోడీ కి ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2004 నుంచి మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు చెప్పుకొచ్చారు. 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కేసీఆర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కలిసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఆయన ఆధ్వర్యంలో ఓబీసీ సంఘాలు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశాయని గుర్తుచేస్తూ అప్పటి ఫోటోలను జత చేస్తూ పోస్ట్‌ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నా.. అయినప్పటికీ తమ డిమాండ్‌ను యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇక.. ఓబీసీ మంత్రిత్వ శాఖ కోసం ప్రధాని మోదీని కూడా కోరామన్నారు. దీంతో.. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి.. 2023 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఇక, ఈ మేరకు ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఈపోస్ట్‌ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అమరి కేటీఆర్‌ ట్వీట్‌ పై మోడీ ఎలా స్పందించనున్నారో? అనే ఆశక్తి నెలకొంది.