NTV Telugu Site icon

Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్

Ktr On Manish Sisodia

Ktr On Manish Sisodia

Minister KTR Condemns Manish Sisodia Arrest: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం అని.. ప్రతిపక్షాలపై బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి, దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో.. అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే ఈ సిసోడియా అరెస్ట్ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న రాజకీయ కుట్రలు.. దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి కక్ష సాధింపు రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్ట్ నిదర్శనమన్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకే సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారని అన్నారు. బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను, నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kasturi: అనసూయ ఆంటీ వివాదంపై.. కస్తూరి ‘డర్టీ’ మీనింగ్

బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి.. ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చేస్తోన్న నీతిలేని, దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తోందని హెచ్చరించారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తోందని ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బీజేపీ భంగపడిందని వెల్లడించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారని.. బీజేపీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Facebook Love Story: ఫేస్‌బుక్‌లో ప్రేమ.. రెండేళ్ల తర్వాత పెళ్లి.. కట్ చేస్తే!