KTR: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎవరు అధైర్య పడకూడదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో, అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుడి కుటుంబం, క్షతగాత్రులను ఆదుకుంటామని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ ఆదేశించారు.
Read also: USB Chargers: అక్కడ ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా? ఎఫ్‌బీఐ కీలక హెచ్చరిక..
ఎంపీ నామా నాగేశ్వరరావు
బీఆర్ఎస్ ఆత్మీయ సభలో అగ్నిప్రమాదంపై ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. బాణాసంచా పేలడం వల్ల గుడిసెలో మంటలు చెలరేగలేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమని, ప్రమాద స్థలానికి, సమావేశ స్థలానికి మధ్య చాలా దూరం ఉందని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు.
Read also: Vande started India: వందే భారత్ ను ఎన్నిసార్లు ప్రారంభించారంటే?
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి నేతలంతా తరలివచ్చారు. గ్రామానికి అగ్రనేతలు రాక సందర్భంగా పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు. పటాకులు కాల్చడంతో మంటలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు చెలరేగి లోపల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నివాసంలో ఉన్న సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, జర్నలిస్టులకు తీవ్ర గాయాలు కాగా.. విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా 10 మంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గాయపడిన వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
BRS Athmeeya Sammelanam: ఖమ్మంలో విషాదం.. సిలిండర్ పేలి తెగిపడ్డ కాళ్లు, చేతులు
