Site icon NTV Telugu

వచ్చే నెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన : కేటీఆర్

విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. 24,25 జిల్లాలో పార్టీ కార్యాలయల నిర్మాణం పూర్తి అయ్యింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు వచ్చే నెల 2న కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుంది అని అన్నారు. భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారు అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న 12 వేళ 769 గ్రామ కమిటీల నిర్మాణము, 3854 వార్డు కమిటీల నిర్మాణం పూర్తి అవుతుంది అని స్పష్టం చేసారు. కొత్తగా జిల్లా కమిటీల ఏర్పాటు, సరికొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ లోనే సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకుంటాం అని తెలిపారు.

Exit mobile version