నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికైన తరువాత మంత్రి కేటీఆర్ తొలిసారిగా కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు కొల్లాపూర్ బస్ డిపో సమీపంలోని అయ్య ప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ముందుగా పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శం కుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కొల్లాపూర్ పట్టణం గులాబీమయంగా మారింది. గులాబీ తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. రాజా ప్యాలెస్ వద్ద జరిగే బహిరంగసభ వేదిక ను అందంగా తీర్చిదిద్దారు. సభకు సుమారు 70 వేల మందిని తరలించేందుకు నాయకులు సమాయాత్తమవుతున్నారు. వేదిక ప్రాంగణం మొత్తం చలువపందిళ్లు వేశారు. బస్‌డిపో వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పనులను ఎమ్మెల్యే బీరం, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎస్టీ సెల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, సీఐ యాలాద్రి పర్యవేక్షించారు.
Ukraine: ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా