Site icon NTV Telugu

Minister KTR: రైతు ప‌థ‌కాల‌పై రాహుల్ స్టడీ చేయాలి

Ktr Rahul

Ktr Rahul

తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీలు నిప్పు ఉప్పులా తయారయ్యాయి. విపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ట్విట్టర్ వేదిక‌గా ప్రతిప‌క్షాల‌కు వార్నింగ్ ఇవ్వాలంటే ఒక్క కేటీఆర్ కి సాధ్యమ‌నే చెప్పొచ్చు. రాహుల్ గాంధీ ప‌ర్యట‌న సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి ట్విట‌ర్ వేదిక‌గా స్వాగ‌తం ప‌లికారు. రైతుల‌కు తెలంగాణ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై స్టడీ చేయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

అంతేకాకుండా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్‌ కౌంట‌ర్ కూడా ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదిక‌గా మండిప‌డ్డారు. ఎన్‌డీఏ గ‌వ‌ర్నమెంట్‌లో భార‌త‌దేశ ఎకాన‌మీ నాశ‌న‌మైంద‌ని ధ్వజ‌మెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లిందని తెలిపారు. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అత్యధికంగా వుందన్నారు. 45 ఏండ్లలో అత్యధికంగా నిరుద్యోగ రేటు పెంచార‌ని మండిప‌డ్డారు. అలాంటి వారు తెలంగాణ‌కు వ‌చ్చి మాకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్.

Vemula Prashanth Reddy: ‘‘ఏ మొహం పెట్టుకొని రైతు సభ నిర్వహిస్తున్నారు?’’

Exit mobile version