NTV Telugu Site icon

Minister KTR : కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం

Ktr

Ktr

టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు టీఆర్ఎస్‌ 21వ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక విజనరీ కావాలి టెలివిజనరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని, మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు. దేశ ప్రజల కష్టాలను డబుల్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని, నరేంద్రమోదీ- రైతు విరోధి అంటూ ఆయన మండిపడ్డారు. నల్లధనం అని అడిగితే మోడీ తెల్లమొకం ఏస్తున్నాడని, ఆత్మనిర్బర్ భారత్ అంటాడు- మనో నిబ్బరం కోల్పోయేలా వ్యవహరిస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

బీజేపీ చేతిలో అధికారం- దేశానికే అంధకారమని ఆయన విమర్శించారు. మోడీ పాలనలో దేశాన్ని చీకట్లో నిల్చోపెట్టారని, ఇది NDA ప్రభుత్వం కాదు- NPA ప్రభుత్వం. NPA అంటే నాన్ పర్ఫామింగ్ అసెట్స్ అనాలన్నారు. మతాల పేరుతో కొట్లాడాలి అని ఏ దేవుడు చెప్పిండు..? అని ఆయన ప్రశ్నించారు. మేరా భారత్ మహాన్ అనే నాయకుడు దేశానికి కావాలి- ఆ నాయకుని తెలంగాణ అందిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్వేగాల దేశం కాదు- ఉద్యోగాల దేశం కావాలన్నారు. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరమన్నారు.