Komatireddy Venkat Reddy: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవికి శాలువాకప్పి, పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగు ప్రజల తరఫున, చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి సందేశాత్మక సినిమాలు తీశారని అన్నారు. నేను యువకుడుగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూసేవాన్ని అంటూ హాస్యాస్పదం చేశారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమన్నారు. చిరంజీవికి భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తెలుగువాడైన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లి పద్మ వైభవిషయం దక్కడం తెలుగు వారికి గర్వకరణమన్నారు.
Read also: TSPSC Chairman: నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకోనున్న మహేందర్ రెడ్డి
పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి ‘విశ్వంభర’ వరకు సాగుతున్న సినిమా ప్రస్థానమని కొనియాడారు. రక్తదానం, నేత్రదానంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చిరంజీవికి మరోసారి అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాజకీయాలు, సినిమాల్లో ఎలాంటి నేపథ్యం లేకుండా అతి సామాన్యులుగా ప్రారంభించి, స్వయం కృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు చేరుకున్న ఇద్దరు అసామాన్య తెలుగు తేజలకు పద్మవిభూషణ్! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. మరొకరు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది.
Tamilisai: సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి పాలన..