Site icon NTV Telugu

ఊహించనంత మోజార్టీతో గెలుస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి

స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి ఊహించనంత మోజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అనంతంరం ఆయన మాట్లాడారు…పోలింగ్ ప్రశాంతం గా జరుగుతుందన్నారు. ఇతర పార్టీల సభ్యులు కూడా టి.ఆర్.ఎస్ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీలకతీతంగా ఓటేసిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వ్యవసాయ ఆధారితమైన నల్గొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత సస్యశ్యామలం అయిందో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా ఉమ్మడి నల్గొండ ప్రజాప్రతినిధులు తిప్పికొడతారన్నారు. రాబోయే విజయం టీఆర్ఎస్‌ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతుందన్నారు. కంచుకోట అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లా మంచు కోట అని ఈ ఎన్నికలు నిరూపిస్తాయని మంత్రి అన్నారు. కుటిల రాజకీయాలు చేస్తూ బీ ఫారం ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో దారుణంగా ఖంగుతింటుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version